భిల్ల జాతి అధినేత చండుడు

Chandu, the leader of the Bhilla raceహీరో విష్ణు మంచు నటిస్తూ, నిర్మిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. తాజాగా ఈ చిత్రంలో నటుడు సంపత్‌ పోషించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అడవినే భయభ్రాంతుల్ని చేసే భీకర జాతి.. నల్ల కనుమ నేలలో పుట్టారు.. మొసళ్ల మడుగు నీరు తాగి పెరిగారు.. భిల్ల జాతి అధినేత చండుడు అంటూ భీకరమైన పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. నటుడు సంపత్‌ ఈ క్యారెక్టర్‌లో అందరినీ మెప్పించేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, బ్రహ్మానందం, బాలీవుడ్‌ హీరో అక్షరు కుమార్‌ భాగమైన సంగతి తెలిసిందే. మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్‌లో ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.