డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

Double entertainmentరామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబోలో రూపొందిన పాన్‌ ఇండియా మూవీ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మించిన ఈ సినిమాలో రామ్‌ పోతినేనికి జోడీగా కావ్య థాపర్‌ నటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరంగల్‌లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. రామ్‌ మాట్లాడుతూ, ”ఇస్మార్ట్‌ శంకర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఈవెంట్‌కి ఇక్కడి రావడం చాలా హ్యాపీగా ఉంది. మణిశర్మ అద్భుతమైన ఆల్బం ఇచ్చారు. స్క్రీన్‌ మీద చూశాక పాటలు ఇంకా నెక్స్ట్‌ లెవల్‌కి వెళ్తాయి. సంజరు దత్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. కావ్య చాలా హార్డ్‌ వర్క్‌ చేసింది. విష్‌ హానెస్ట్‌గా తన పని తను చేస్తూ ఉంటాడు. చార్మి ఫైటర్‌. ఆమె లేకుండా ఈ సినిమా పాజిబుల్‌ అయ్యేది కాదు. పూరితో పని చేసినప్పుడు వచ్చే కిక్‌ నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటుంది’ అని తెలిపారు.
”డబుల్‌ ఇస్మార్ట్‌’ గురించి మాట్లాడాలంటే ఒకే ఒక పేరు.. రామ్‌ పోతినేని. ఇస్మార్ట్‌ శంకర్‌, డబుల్‌ ఇస్మార్ట్‌కి రామ్‌ ఎనర్జీ మామూలుగా లేదు. సంజు బాబాకి నేను పెద్ద ఫ్యాన్‌ని. 150 సినిమాల హీరో ఆయన. ఆయన ఈ సినిమాలో చేయడం కొత్త కలర్‌ తీసుకొచ్చింది. రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ గురించి చేసిన ఫోన్‌ కాల్‌తో నేను చాలా ఎమోషనల్‌ అయిపోయాను. నామీద ఆయనకి ఉన్న ప్రేమ, అభిమానంతో చేశారు.
– డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌