జిల్లా భూ సదస్సులు జయప్రదం చేయాలి

జిల్లా భూ సదస్సులు జయప్రదం చేయాలి– వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సత్యయ్య
నవతెలంగాణ-దోమ
మండలంలో ధరణి పోర్టల్‌తో బాధపడుతున్న రైతులు పేదల భూ సమస్యలు పరిష్కరించాలని, వ్య వసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యద ర్శులు హెచ్‌. సత్యయ్య, రఘురామ్‌ కోరారు. అనేక సంవత్సరాలుగా ఉన్న పేదలందరికీ కొత్త ప ట్టా పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొడంగల్‌ పట్ట ణం లో రెడ్డి బసిరెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో 2024 ఆగష్టు13న నిర్వహించబోయే జిల్లా భూ సద స్ులు జయప్రదం చేయాలని మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు జిల్లా భూ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించా రు. కార్యక్రమంలో సత్తయ్య, శేఖర్‌, కష్ణ, మొగులయ్య రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.