– అతివేగంగా బైకు నడిపి ఒకరు, ప్రయివేటు స్కూల్ బస్సు
– ఢీకొీని మరొకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ మండల పరిధిలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగంగా ద్విచక్ర వాహ నం నడిపి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమ వారం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. వీకర్ సెక్షన్ కాలనీ లోని ఇజ్జత్నగర్కు చెందిన కురుమూర్తి (48) వృత్తిరీత్యా పెయింటర్. ఇతను ఉదయం 7 గంట ల సమయంలో ద్విచక్ర వాహనం నడుపుకుంటూ మరోవ్యక్తిని వెకాల కూర్చున పెట్టుకొని శంషా బాద్ వైపు వస్తున్నారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోనే చెన్నమ్మ హౌటల్ సర్వీస్ రోడ్లో అతివేగంగా బైక్ నడపడం వల్ల ప్రమాద వశాత్తు వారు కింద పడ్డారు.. ఈ ప్రమాదంలో అదుపుతప్పి ద్విచక్ర వాహనం కింద పడ్డది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కురుమూర్తికి తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. వెను కాల కూర్చున్న వ్యక్తికి రక్తగాయాలయ్యాయి. విష యం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించా రు. మృతదేహన్ని పోస్టుమార్టం ఉస్మానియా మా ర్చరికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రయివేటు స్కూల్ బస్సు ఢీకొీని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘట న శంషాబాద్ ఆర్జీ ఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవా రం తెల్లవారు జామున జరిగింది. స్టేషన్హౌస్ ఆ ఫీసర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. శం షాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతం రాయి గ్రామంలో జాతీయ రహదారి 44పై తెల్లవారుజా మున 5 గంటల 45 నిమిషాలకు నడుచుకుంటూ వెళ్తున్న ఒక గుర్తు తెలియని వ్యక్తిని ప్రయివేటు స్కూల్ బస్సు ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్య క్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసు కున్న పోలీ సులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదే హాన్ని స్వాధీ నం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.