– ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో
రాష్ట్ర ప్రజారోగ్య మాజీ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు వీఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా, ప్రజారోగ్య విభాగంలో జాయింట్ డైరెక్టర్ క్యాడర్‌లో ఉన్న ఆయన్ను ప్రభుత్వం గత నెల 27న మహబూబాబాద్ అడిషినల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా నియమించింది. కానీ, ఆయన లాంగ్ లీవ్‌లో ఉండటంతో జాయిన్ అవ్వలేదు. ఇన్‌చార్జ్ డీహెచ్ పోస్టు నుంచి తప్పుకున్నాక ఆయన లాంగ్ లీవ్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన రెండుసార్లు వీర్‌ఎస్‌కు అప్లై చేయగా, తాజాగా ఆమోదిస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది.