ఆస్పత్రులకు క్యూ..

Queue for hospitals..– విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు
– జురోజుకూ పెరుగుతున్న ఓపీ
– జర్వం, జలుబు, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో ఆస్పత్రులకు..
– నెల రోజుల్లో హఫీజ్‌పేటలో 2, కుల్కచర్లలో 4 డెంగ్యూ కేసులు నమోదు
– పలుచోట్ల సిబ్బంది కొరత
– ఆస్పత్రుల్లో మరిన్ని మెరుగైన వసతులతో
– పాటు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజల విజ్ఞప్తి
వర్షాకాలం సీజన్‌ కావడం, సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని పీహెచ్‌సీల్లో గతంతో పోల్చితే ఓపీ సంఖ్య ప్రస్తుతం పెరిగింది. జ్వరం, దగ్గు, జలుబు, కీళ్ల, కాళ్ల, ఒళ్లు నొప్పులతో ప్రజలు ఆస్పత్రులకు వస్తున్నారు. గత నెలరోజుల్లో హఫీజ్‌పేట, కుల్కచర్ల ఆస్పత్రుల్లో మొత్తం 6 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. పలు ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉంది. మందులు మాత్రం దాదాపు అన్నీ ఆస్పత్రుల్లో అందుబాటుో ఉన్నాయి. అయితే ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించడంతోపాటు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సోమవారం నవతెలంగాణ విలేకరులు పీహెచ్‌సీలను సందర్శించారు. పీహెచ్‌సీల్లో ప్రస్తుత పరిస్థితులపై కథనం.
నవతెలంగాణ-విలేకరులు
కందుకూరు :
కందుకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లతోపాటు సిబ్బందిని బదిలీ కావడంతో ఇన్‌చార్జి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతీరోజు ఓపీ 100 పైబడి ఉంటుంది. దుబ్బచర్ల సబ్‌ సెంటర్‌ నుంచి డాక్టర్‌ అఖిల సోమవారం 11 గంటల సమయంలో వచ్చి పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. మందుల కొరత లేదని ఆమె తెలిపారు. కుక్కకాటుకు గురై వ్యక్తి చికిత్స కోసం వచ్చాడు.
చందానగర్‌ :
హఫీజ్‌పేట ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో రోజు 180 నుంచి 200 మంది చికిత్స పొందుతు న్నారని డాక్టర్‌ దివ్య తెలిపారు. ఇప్పటి వరకు 2 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. పీహెచ్‌సీలో 2 డాక్టర్స్‌, స్టాఫ్‌నర్స్‌, ఆశావర్కర్లు 11 మంది ఉన్నారు. 5 మం ది స్టాఫ్‌ నర్సులు ఉండాల్సిన స్థానంలో ఒక్కరే పని చేస్తున్నారు.
శంకర్‌పల్లి :
శంకర్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి కాళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల రోగులు ఎక్కువగ వస్తున్నారు. సీజన్‌ వ్యాధులకు గురై న వారు 5 శాతం మంది ఉన్నారు. ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉ న్నారు. లింగంపల్లిలో డాక్టర్‌ లేకపోవడంతో ఒక డాక్టర్‌ డిప్టే షన్‌పై అక్కడికి వెళ్తున్నారు. సూపర్‌వైజర్‌ పోస్టు ఖాళీ ఉంది. మందల కొరత లేదు.
ఆమనగల్‌ :
ఆమనగల్‌లో ప్రభుత్వ ఆస్పత్రి స్థలంలో నూతన భవనం నిర్మిస్తున్నందున ప్రసు ్తతం వైద్య సేవలను సమీపంలో ఉన్న క్లస్టర్‌ కర్యాలయంలో కొనసాగిస్తున్నారు. రెగ్యులర్‌గా ఓపీ 150కి పైగానే ఉంటుంది. ప్రస్తుత సీజన్‌లో 250 మందికి పై గా వైద్యం కోసం వస్తున్నారు. వీరిలో జలుబు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారు అధికంగా ఉన్నారు. వారికి కాలసిన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకైతే డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా లాంటి కేసులు నమోదు కాలేదు. గ్రామాల్లో కూడా ఫీవర్‌ సర్వే చేయిస్తున్నాం. ఆస్పత్రిలో పూర్తి స్థాిలో వైద్య సిబ్బంది ఉన్నారని డాక్టర్‌ పరీక్షిత్‌ నరేందర్‌ తెలిపారు.
షాద్‌నగర్‌ :
షాద్‌నగర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో రోజువారీగా ఓపీ 400 నుంచి 500 ఉంటుంది. మలేరియా, డెంగ్యూ జ్వరాలు నమోదు కాలేదు. మందుల కొరత లేదు. సిబ్బంది కొరత లేదు. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని బూర్గుల ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో రోజువారీ ఓపీ 90 నుంచి 100 వరకు ఉంది. డెంగ్యూ, మలేరియా కేసులు నోదు కాలేదు. సిబ్బంది కొరత లేదు. మందుల కొరత లేదు.
కొత్తూరు :
కొత్తూరు మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఏడు సబ్‌ సెంటర్లు ఉన్నాయి. కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజూ సుమారు 100 మంది ఔట్‌ పేషెంట్లు చికిత్స తీసుకుంటారు. సాధారణ జ్వరంతో మూడు నుంచి నా లుగు కేసులు నమోదవు తున్నాయి. మలేరియా, డెం గ్యూ కేసులు నమోదు కాలేదు. ప్రతీ సోమ, గురువాం రోజుల లో గర్భిణులు సుమారు 50 నుంచి 60 మంది వరకు చికిత్స తీసుకుంటారు.
మంచాల :
మంచాల ప్రభుత్వ ఆస్పత్రిలో జూలై నెల మొత్తం 2,224 అవుట్‌ పేషంట్స్‌ వచ్చారు. ఆగస్టులో ఇప్పటి వరకు 714 వచ్చారు. కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, దగ్గు, దమ్ము లాంటి సమస్యలతో ప్రజలు ఆస్పత్రికి వస్తున్నారు. డాక్టర్‌ శ్రావణ్‌కు మార్‌రెడ్డి, ఇద్దరు సూపర్‌వైజర్లు, స్టాఫ్‌నర్స్‌ 2, ఫార్మసీ 1, ల్యాబ్‌ 1, హెల్త్‌ ఆఫీసర్‌ 1, ఏఎన్‌ఎం 3 ఉన్నారు. షుగర్‌ చెక్‌ చేసేవా రు లేరు. త్వరలోనే డిప్టేషన్‌లో వస్తారని వైద్యులు తెలిపారు.
మొయినాబాద్‌ :
మొయినాబాద్‌ పీహెచ్‌సీకి రోజుకి 100 నుంచి 150 మంది రోగులు వస్తున్నారు. ఆస్పత్రిలో టాయిలెట్స్‌ శుభ్రంగా లేవు. ఆవరణ వార్డులు పూర్తిస్థాయిలో పరిశుభ్రత పాటించడం లేదు. డెంగ్యూ, మలేరియా కేసులు నమోదు కాలేదు.
యాచారం :
యాచారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గత ప్రభుత్వం తెలంగాణ హెల్త్‌ కమ్యూనిటీ సెంటర్‌గా ఆప్‌గ్రేడ్‌ చేసింది. అయితే ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరింది. పెచ్చులు ఉడుతున్నాయి. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ నూతన భవన నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధులతో శంకుస్థాపన కూడా జరిగింది. కానీ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.
కుల్కచర్ల :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రతినిత్యం అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని మండల వైద్యాధికారిణి డాక్టర్‌ మాధురి తెలిపారు. ప్రతిరోజు దాదాపు గా 150 మంది వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. నెల రోజులుగా 4 డెంగ్యూ పాజిటివ్‌ కేసులు వచ్చాయి. నెల రోజులుగా 650 మంది రక్త పరీక్షలు చేయించుకున్నారు. బి కాప్లెక్స్‌ ఇంజక్షన్స్‌, మ్యూకనాజోల్‌ ఆయింట్‌ మెంట్స్‌, ఐ డ్రాప్‌ మందుల కొరత ఉంది.
పెద్దేముల్‌ :
పెద్దేముల్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకు 3,120 మంది రోగులకు వైద్య పరీక్షలు అందుతున్నాయి. రోజుకు ఓపీ 140 మంది వస్తున్ారు. జ్వరం, దగ్గు, మోషన్స్‌, బీపీ, షుగర్‌ వంటి రోగాలకు వైద్యం కోసం వస్తు న్నారు. ఆస్పత్రిలో ఇటీవల బదిలీపై స్టాఫ్‌ నర్స్‌ వెళ్లిపోవడంతో స్టాఫ్‌ నర్స్‌ పోస్ట్‌ ఖాళీగా ఉంది.