ఎక్సైజ్, పోలీస్ శాఖ సంయుక్తంగా సోమవారం హాలియాలో డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు కళాశాల ప్రిన్సిపల్స్ తో డ్రగ్స్ నిర్మూలన ర్యాలీ నిర్వహించారు .ఈ సందర్భంగా హాలియా సీఐ జనార్దన్ గౌడ్ ఏక్సైజ్ సీఐ కల్పన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ కు బానిసలు కాకుండా ఉండాలని తమ చక్కని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని అన్నారు. ఈ ర్యాలీలో హాలియా ఎస్ఐ సతీష్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐ సంపత్ కుమార్, పోలీస్ ఎక్సైజ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.