మిషన్ భగీరథ నీటి కోసం పైపులు వేశారు 

Mission Bhagiratha laid pipes for water– కాలువను పూడ్చడం మరిచారు 
నవతెలంగాణ – చేర్యాల 
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామంలోని హైస్కూల్ పక్క వీధిలో 15 రోజుల క్రితం మిషన్ భగీరథ నీటి కోసం కాలువ తీసి పైప్ లైన్ వేశారు. పైప్ లైన్ వేసి దాదాపు వారం రోజులు గడుస్తున్నప్పటికీ కాలువను పూడ్చక పోవడంతో అటు వైపు వెళ్లే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.కాలువను పూడ్చి వేయాలని గ్రామస్తులు మిషన్ భగీరథ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి తక్షణమే కాలువను పూడ్చి వేసి దారిని అందుబాటులోకి తీసుకురావాలని  డిమాండ్ చేస్తున్నారు.