నవతెలంగాణ – గోవిందరావుపేట
రుణమాఫీ విషయంలో అమలు చేయడం చేతకాక నిబంధనల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని పరకాల బీజేపీ శాసనసభ అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. మంగళవారంమండల పరిధిలోని బుసాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షులు లోడే శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన బీజేపీ మండల అధ్యక్షులు మద్ధీనేని తేజ రాజు ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు అనే నినాదంతో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ పరకాల శాసనసభ అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం పాల్గొని రైతుల యొక్క సమస్యలను రైతులతో ముఖాముఖి మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అమలు చేయలేని చాలా హామీలు ఇచ్చింది. హామీలను నమ్మిన సామాన్య ప్రజలు కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించారు. అనతి కాలంలోనే హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పటివరకు హామీలు నెరవేర్చకుండా సామాన్య ప్రజలను మరీ ముఖ్యంగా రైతులను మోసం చేస్తున్నది. రైతులకు రెండు లక్షల వరకు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులందరికీ చేయకుండా నిబంధనల పేరుతో చాలామంది రైతులను దగా చేస్తోంది. అందుకే తెలంగాణ రైతు మా పరిస్థితి ఏంటని? మా భవిష్యత్తు అంధకారం అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నరు.రైతుకు రుణమాఫీతో పాటు రైతు భరోసా అన్నారు దాని ఊసే లేదు కౌలు రైతులకు ఆర్థిక సాయం అన్నారు కూలీ రైతులకు ఆర్థిక భరోసా అన్నారు ఇవన్నీ ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్నారు. రైతుల ఉసురు ఊరికే పోదు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్తారు. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో రైతుల పక్షాన పోరాడే బీజేపీ నాయకులను గెలిపించుకుని కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా మోసపూరిత విధానాలు వదిలేసి పంట రుణం తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల లోపు తప్పకుండా రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న మన బీజేపీ ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఏర్పాటు చేసింది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు పెంచుతూ వారికి అండగా నిలుస్తున్నది. రైతులకు ఆర్థిక భారం తగ్గించడానికి ఎరువులపై చాలా పెద్ద మొత్తంలో సబ్సిడీని ఇస్తున్నది. రైతులు టెక్నాలజీ ఉపయోగించుకొని శ్రమను సులభతరం చేసుకోవడానికి సబ్సిడీపై యంత్రాలు, పనిముట్లను అందిస్తున్నది. అందుకే రైతులను భారతీయ జనతా పార్టీకి స్థానిక ఎన్నికలలో అవకాశం ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన పోరాడి ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రాచారి, నరేష్, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, జిల్లా కిసాన్ మోర్చా ఇన్చార్జ్ పెద్ది మహేందర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు జినుకుల కృష్ణకర్, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు జాడి రామరాజనేత, ఓబీసీ జిల్లా అద్యక్షుడు వెంకటేశ్వర్లు,జిల్లా నాయకులు రుద్రారపు సురేషు, మహేందర్ రెడ్డి,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మద్దిని కృష్ణమూర్తి, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి తూముకుంట్ల మహిపాల్ రెడ్డి,రవీందర్ రెడ్డి,ములుగు మండల అధ్యక్షులు గాదం కుమార్, ఏటూరు నాగారం మండల అధ్యక్షుడు రాజశేఖర్, ములుగు మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు బండి బాబు, గోవిందరావుపేట కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వీరభిక్షం, తాడ్వాయి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భూక్యా శ్రీనివాస్, మంగపేట మండల కోశాధికారి బుర సుధాకర్, బుస్సాపూర్ బూత్ అద్యక్షుడు వడ్లకొండ యాకయ్య, మధ్ధినేని వెంకటేశ్వర్లు, బుస్సాపూర్ రైతులు, బీజేపీ నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.