రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 

Farmers' welfare is the government's mission– పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ 
నవతెలంగాణ – తాడ్వాయి 
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తాడ్వాయి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ (పిఎసిఎస్) పులి సంపత్ గౌడ్ అన్నారు. మంగళవారం పిఎసిఎస్ కార్యాలయంలో రైతులతో మాట్లాడారు. మండలంలోని రైతులకు సరిపడా ఎరువులు యూరియా, 20 20 లు అందుబాటులో ఉన్నాయన్నారు. నాణ్యమైన ఎరువులు సరసమైన ధరలకు అందియ్యడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాయిదాల పద్ధతి కాకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీని చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేపట్టి రైతు రుణం తీర్చుకున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పిఎసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.