మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని, మంగళవారం భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ…మోడల్ స్కూల్ ప్రారంభించు 12 సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఒక్కసారి కూడా బదిలీలు జరగలేదుని రాష్ట్ర ప్రభుత్వం బదిలీలను వెంటనే చేపట్టాలని,010 ద్వారా వేతనాలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, నేషనల్ సర్వీస్ ఇవ్వాలని బొమ్మలరామారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో TSMSTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిలువేరు మహేష్ , కేదార్నాథ్, శీనయ్య,రూప, సంగీత, పారిజాత,రవిబాబు, శివప్రియ, వినోదరాణి, అన్నపూర్ణ, సింధూర లు పాల్గొన్నారు.