దర్శకుల సంఘానికి సుకుమార్‌ రూ.5 లక్షల విరాళం

Sukumar donates Rs. 5 lakhs to directors' associationసభ్యుల సంక్షేమమే లక్ష్యంగా దర్శకుల సంఘం నిరంతరం శ్రమిస్తోంది. ఇందులో భాగంగా సంఘం సభ్యులకు గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యాన్ని కల్పించింది. సభ్యులందరికీ ఈ సౌకర్యాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. వీరి కృషికి చేయూతనిస్తూ ప్రముఖ దర్శకుడు బి.సుకుమార్‌ గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం రూ. 5 లక్షలను విరాళంగా అందించారు. ఈ విషయాన్ని దర్శకుల సంఘ అధ్యక్షులు బి.వీర శంకర్‌, కార్యదర్శి సి.హెచ్‌.సుబ్బారెడ్డి మీడియాకు అధికారికంగా తెలిపారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఎప్పుడు అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని, ఈ ఏడాది గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పథకానికి తానిప్పుడు ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నానని సుకుమార్‌ చెప్పడం తమకెంతో ఆనందాన్ని కలిగించింది అని, సభ్యుల కోసం మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు మరింత కృషిచేస్తామని దర్శకుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెప్పారు.