వాహనాలకు ధృవపత్రాలు కలిగి ఉండాలి

Vehicles should have certificatesనవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
వాహనాలకు సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలని మావల ఎస్సై వంగ విష్ణువర్ధన్‌ సూచించారు. మంగళవారం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పట్టణంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఇందులో భాగంగా దస్నాపూర్‌ వద్ద వాహనాల తనిఖీ డ్రైవ్‌ చేపట్టారు. హెల్మెట్‌, ధరించాలని, మైనర్లు వాహనాలు నడపవద్దని, లైసెన్స్‌ ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.