బాధితులకు ఫోన్లు అప్పగించిన పోలీసులు

Look at the accommodationనవతెలంగాణ-ధారూర్‌
మండల పరిధిలోని గురుదొట్లకు చెందిన కొంకణి రాములు, నాసన్‌పల్లికి చెందిన నర్సింలు, వికారాబాద్‌ మండలం మదనపల్లికి చెందిన శేషికలరెడ్డిలకు సంబంధించిన ఫోన్లు కొన్ని రోజుల క్రితం పొగట్టుకున్నారు. వారు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సీఈఐఆర్‌ ద్వారా గుర్తించి మంగళవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎస్‌ఐ,సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్రంలో ప్రతి శనివారం కూరగాయల మార్కెట్‌ జరుగుతందని, మార్కెట్లో వరుసగా పోన్ల దొంగతనాలు జరుగుతున్న సమాచారం ఉండటంతో పోలీసుల గస్తీ పెంచినట్టు ఎస్‌ఐ వేణుగోపాల్‌ తెలిపారు.