– విద్యార్థులకు అనుకూలంగా బస్సులు నడపాలి
– ఎన్కేపల్లికి నూతన బస్సు ఏర్పాటు చేయాలి
– ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
నవతెలంగాణ-కోడంగల్
కోడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులు అనుగుణంగా బస్సులు నడపాలని, ఎన్కేపల్లి బస్సును పునరుద్ధరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్, కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులు రాజు. కొడంగల్ డివిజన్ కమిటీ సభ్యులు భతుల శివకుమార్, మల్లీశ్వరి డిమాండ్ చేశారు. కోడంగల్‌లో వారు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కోడంగల్‌లో విద్యను అభ్యసిస్తున్న ప్రభుత్వ పాఠశాలల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీకళాశాలలో చదువుతున్న విద్యార్థులకు తగినన్ని బస్సులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బస్సులో ఉన్న విద్యార్థుల సమయానుకూలంగా రాకపోవడంతో విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొడంగల్ ప్రాంతానికి అధిక బస్సులు కల్పించి గ్రామాల గేట్ల వద్ద ఎక్స్ ప్రెస్ బస్సులు ఆపాలని, ఎన్కేపల్లి గ్రామం నుంచి ప్రతి రోజు దాదాపు 125 మందికి పైగా విద్యార్థులు రోజు విద్యను అభ్యసించడానికి కోడంగల్ పట్టణానికి వస్తున్నారని బస్సును గత ఏడాది క్రితం నిలిపివేశారని ఆ బస్సుని పునరుద్ధరించాలన్నారు. దీంతో వారు బస్సు సాకర్యం లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆటోలకు రోజు డబ్బులు కట్టలేక పెద విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉందని వెంటనే ఎన్కేపల్లి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఎస్ఎఫ్ఐ కోడంగల్ డివిజన్ కమిటి డిమాండ్ చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.