మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం కల్పించాలి

Minimum wages should be given to midday workers– శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ జి.కవిత
– ఆమనగల్‌లో మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
– ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు వేతనం అమలు చేయాలని డిమాండ్‌
నవతెలంగాణ-ఆమనగల్‌
మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం కల్పించాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ జి.కవిత డిమాండ్‌ చేశారు. పైలెట్‌ ప్రాజెక్టుగా కొడంగల్‌ ప్రాంతంలో ‘హరేరామ హరేకృష్ణ స్వచ్ఛంద సంస్థ’తో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సీఐ టీయూ ఆధ్వర్యంలో మండల విద్యావనరుల కేంద్రం ఆవరణలో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకురాలు కవిత పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలే మధ్యాహ్న భోజన కార్మికరాళ్లుగా పని చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు చెల్లించి వెట్టి చాకిరి చేయించుకుందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచ కుండా, పెండింగ్‌ బిల్లులు కూడా చెల్లింకుండా నిర్ల క్ష్యం చేస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించకుండా మధ్యాహ్న కార్మికులకు కనీస వేతనం కల్పించి, పీఎఫ్‌, ఈఎస్‌ ఐ, బీమా సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆమనగల్‌ ఏరియా కన్వీనర్‌ జె.పెంటయ్య, నాలుగు మండ లాల మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, లక్ష్మమ్మ, రమాదేవి, మంజుల, యాదమ్మ, వరలక్ష్మి, బుజ్జమ్మ పాల్గొన్నారు.