గ్రామాల అభివృద్ధికి పాటు పడ్డాం.. పెండింగ్ బిల్లులు ఇప్పించండి

We have joined the development of villages.. Give us the pending bills– ఎంపీడీవోకు మాజీ సర్పంచుల వినతి

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోగల 34 గ్రామపంచాయతీలలో గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డాం తమ పెండింగు బిల్లులు వెంటనే ఇప్పించాలంటూ ఉమ్మడి మండలంలోని సర్పంచులు అందరూ బుధవారం నాడు మద్నూర్ మండల పరిషత్ కార్యాలయానికి తరలివచ్చి ఎంపీడీవో రానికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. అభివృద్ధి పనులు చేశాం ఎంపీ రికార్డులు ఐ ఉన్నాయి ఒక్కొక్కరికి లక్షల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు మోటారు రిపేరింగులు కరెంటు బల్బుల బిల్లులు పారిశుద్ధ్యనికి సంబంధించిన సామాగ్రి కొనుగోలు బిల్లులు గత సంవత్సరం నుండి పెండింగ్ లోనే ఉన్నాయని, సంవత్సరం కాలంగా పెండింగ్ బిల్లుల కోసం ఎదురు చూడవలసి వస్తుందని అన్నారు. బిల్లులు అందకపోవడం మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో పోటీపడి సర్పంచులు అభివృద్ధి పనులు చేస్తే, ప్రభుత్వం మా బిల్లులు చెల్లించకుండా మా జీవితాలతో చలిగాటం ఆడుతుందని అన్నారు. దయచేసి ప్రస్తుతం గ్రామపంచాయతీలకు వచ్చినటువంటి 15 ఆర్థిక సంఘం నిధులను మాకు చెల్లించి, మా కుటుంబాలను ఆదుకోవాలని ఎంపీడీవో కు అందజేసిన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. మండలంలోని ఉమ్మడి మండలానికి చెందిన సర్పంచులు ఎంపీడీవోకు అందజేసిన వినతిపత్రం కార్యక్రమంలో పాల్గొన్నారు.