రామడుగు బ్రిడ్జి అతి త్వరలో ప్రారంభిస్తాం 

Ramadugu Bridge will be started very soon– చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం 

– రామడుగు బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి 
నవతెలంగాణ – రామడుగు 
రామడుగు బ్రిడ్జిని త్వరలో ప్రారంభిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈ మేరకు  రామడుగు వాగుపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని బుధవారం నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో నాలుగు మండలాల రాకపోకలకు నిలయంగా మారిన రామడుగు బ్రిడ్జి నిర్లక్ష్యానికి గురైందన్నారు. మండల అధికారులతో కలిసి బ్రిడ్జి, భూనిర్వాసిత రైతులతో మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో మీకు న్యాయం చేస్తూ మీకు రావలసిన పరిహారం వెంటనే చెల్లించ విధంగా చర్య తీసుకుంటూ బ్రిడ్జిపై నుంచి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.ఆయన వెంట ఎమ్మార్వో వెంకటలక్ష్మి,ఎంపీడీవో సంగి రాజేశ్వరీ,తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్,రామడుగు మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్,వెలిచాల మాజీ సర్పంచ్ వీర్ల నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్,ఆడెపు రంగన్న,ములుగు రాజశేఖర్ గౌడ్, తడగొండ హనుమంతు,నర్సింగ్ బాబు,మామిడాల నాగరాజు,బాపురాజ్,తడగొండ లక్ష్మణ్,పాల్గొన్నారు.