ఆర్థికాభివృద్ధికి ‘మహిళ శక్తి’ వరం..

'Women power' boon for economic development..– ఇందిరా మహిళ శక్తి ఆర్గానిక్ మిల్ ప్రారంభంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి
నవతెలంగాణ – బెజ్జంకి 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల ఆర్థికాభివృద్ధికి అమలు చేస్తున్న’మహిళ శక్తి’గొప్ప వరమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధ్వర్యంలో మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ దుకాణ సముధాయంలో రేగుపల్లి గ్రామ సూర్య మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యురాలు మాతంగి భారతి మహిళ శక్తిలో నెలకొల్పిన ఇందిరా మహిళా శక్తి భారతి ఆర్గానిక్ మిల్ ను బుధవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.సూపరిడెంట్ అంజయ్య,పీఆర్ ఏఈ సమ్మయ్య,ఏపీఎం నర్సయ్య,మాజీ ఎంపీపీ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,సీసీ తిరుపతి,పద్మ,వీఓ నాగవ్వ,పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ రెడ్డి,మహిళా సంఘం సభ్యులు హాజరయ్యారు.
భాధిత కుటుంబానికి పరామర్శ..
మండల కేంద్రానికి తాడిచెట్టు రాకేశ్ ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందాడు.మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.పులి కృష్ణ,లింగాల శ్రీనివాస్,అక్కరవేణి పోచయ్య,మంకాలి ప్రవీన్,గూడెల్లి శ్రీకాంత్,శానగొండ శరత్,బోనగిరి రాజేందర్,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.