18న సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు

– ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఈనెల 18న తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రతి సంవత్సరం ఆగస్టు 18న జయంతి ఉత్సవాలు, ఏప్రిల్‌ 2వ తేదీన వర్ధంతి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. స్టేట్‌ ఫెస్టివల్‌గా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.