
భిక్కనూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్ స్పెక్టర్ సంపత్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం సాధించడానికి ప్రాణాలర్పించిన మహానుభావులను గురించి కొనియాడారు, ప్రతి ఒక్కరూ దేశభక్తితో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయికుమార్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.