మండల వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Independence Day celebrations were held grandly across the Mandalనవతెలంగాణ – తాడ్వాయి 
మండల వ్యాప్తంగా ప్రజలు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో స్థానిక తహసిల్దార్ తోట రవీందర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుమన వాణి, పిఎసిఎస్ కార్యాలయంలో పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి పోరిక జై సింగ్, సిడిపిఓ కార్యాలయంలో సిడిపిఓ మల్లీశ్వరి, తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ రణధీర్, కాటాపర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మెడికల్ ఆఫీసర్ వేముల రంజిత్, మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ యాప సాంబయ్య, ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం రేవతి, కస్తూరిబా గాంధీ పాఠశాలలో(కేజీబీవి) ప్రిన్సిపాల్ ఇర్ప పుష్ప, తాడ్వాయి అడవి శాఖలో టెరిటోరియల్ రేంజ్ లో ఎఫ్ఆర్ఓ కోట సత్తయ్య, వన్యప్రాణి విభాగం డిప్యూటీ ఎఫ్ఆర్ఓ కృష్ణవేణి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, మండలంలోని అన్ని పాఠశాలల్లో నీ ప్రధానోపాధ్యాయులు, ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎంలు, 18 గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారులు, మహిళ సమైక్య భవనంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు బంగారి మానస, అంబేద్కర్ యువజన సంఘాలు, మండలంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడీ టీచర్లు వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఎగరవేసి, ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. మిఠాయిలను పంపిణీ చేసుకుని సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో సుమన వాణి, మండల రెవెన్యూ ఆఫీసర్లు సాంబయ్య, రాజు, ఏపిఎం శ్రీనివాసరావు, అకౌంటెంట్ రఘుపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దండగుల మల్లయ్య ఎంపీడీవో కార్యాలయంలో సూపర్డెంట్ నరసింహ స్వామి, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ కార్యాలయాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాల ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.