మెండోర మండలం దూదిగాం తాజా మాజీ సర్పంచ్ సుజాత పసుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు గురువారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టిలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన మెచ్చి, కాంగ్రెస్ పార్టీ తోటే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సుజాత పసుల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో సరికల రాజారెడ్డి, అయిలి శ్రీను, రఫీ, రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.