
78 వ పంద్రాగస్ట్ వేడుకలను గురువారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేసారు.ఈయన ఇక్కడకు గతేడాది ఆగస్ట్ 15 నే ఇక్కడకు బదిలీ పై రావడం విశేషం.గతేడాది ఇదే రోజు ఆయన బాధ్యతలు స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు,నాయకులు,సిబ్బంది పాల్గొన్నారు.