నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణ ప్రజలు వ్యాధులు రాకుండా డబ్బు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని 15 వార్డులో డ్రైడే ఫ్రైడే, సఫాయి అప్నా బీమారి భగావో అనే కార్యక్రమాలు చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఇంటి పరిసరాలలో ఉన్న పాత డబ్బాలు, టైర్లలో, పాత గోళాలలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. వార్డులలో.స్ప్రే బ్లీచింగ్ పౌడర్ చెల్లించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి పురపాలక సంఘ వాహనానికి అందించాలని, నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణాధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్ సాంబ రాజు, జవాన్లు సారయ్య, ప్రభాకర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.