సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి: దేశ్యానాయక్

CPI(M) District Wide Level Meeting Jayaprad: Deshyanayakeనవతెలంగాణ – ఉప్పునుంతల

భారత కమ్యునిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎల్. దేశ్యనాయక్ హాజరై మాట్లాడుతూ.. ఈ నెల 21 బుధవారం అచ్చంపేట పట్టణం టీఎన్జీవో భవన్ లో జరిగే సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం ను జయప్రదం చేయాలని పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ సభకు రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యులు కామ్రేడ్ జాన్ వెస్లీ హాజరు అవుతారన్నారు. గ్రామాల సమస్యల పై అధ్యయన యాత్రలు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న పాడి రైతుల డబ్బులను ఇవ్వాలన్నారు. ఈ మండల స్థాయి సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు, సీపీఐ(ఎం) మండల నాయకులు గొడుగు వెంకటయ్య, ఆలూరి రాములు, పానుగంటి శ్రీరాములు, పానుగంటి చిన్నారవి, పార్టీ సానుభూతి పరులు కేసుమాల్ల సైదులు పాల్గొన్నారు.