నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు. వేకువ జామున అర్చకులు స్వామివారికి మహాన్యాసకపూర్వ ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడెలను కట్టేసి, రాజన్నను దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ఓడి బియ్యం, కుంకుమార్చనలు, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో మహిళ ముత్తైదువులకు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. దేవాలయాల్లో రద్దీ ఎక్కువ ఉండడంతో ఆలయ ఈవో ప్రత్యేక దృష్టి సారించి ,క్యూలైన్లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.