మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక బాలికల పాఠశాల విద్యార్థులకు కమ్మర్ పల్లికి చెందిన చింత ప్రదీప్ తన తండ్రి చింత బలరాం జ్ఞాపకార్థం నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 66మంది విద్యార్ధిని, విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ ప్రింటెడ్ హాండ్ రైటింగ్ నోట్ పుస్తకాలను మండల విద్యాధికారి ఆంధ్రయ్య చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింత ప్రదీప్ మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా తన తండ్రి జ్ఞాపకార్థం పలు సేవా ార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేసిన చింత ప్రదీప్ ను ఎంఈఓ ఆంధ్రయ్య అభినందించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చింత ప్రదీప్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ శాలువాతో సత్కరించి, పాఠశాల విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయులు రవి కుమార్, సీఆర్పీలు అంజయ్య, రాజేష్, లలిత, విద్యాభిమాని లుక్క గంగాధర్, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.