కలకత్తలో జరిగిన వైద్యురాలి సంఘటనకు మద్దతుగా జిల్లా ఆయుష్ విభాగం తరఫున నల్ల బ్యాడ్జీలు ధరించి మద్దతు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ.. కలకత్తాలో జరిగిన వైద్యురాలి సంఘటన ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా పరిగణలోకి తీసుకొని నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వాలు అండగా నిలబడాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, ఉమా ప్రసాద్, నీరజ, ఆశ, ఫార్మసిస్ట్ సిబ్బంది బిక్షపతి, రమేష్, శిరీష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 42 ఆయుష్ వైద్యశాల డాక్టర్లు సిబ్బంది తదితరులు మద్దతు తెలిపారు.