
గత కొన్ని రోజులు గా ఆలనా పాలనా లేని సామాజిక ఆరోగ్య కేంద్రానికి సూపరింటెండెంట్ పోస్ట్ ను డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు భర్తీ చేసారు. ఇదే ఆసుపత్రి లో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రాధా రుక్మిణి సీనియర్ కావడంతో ఆమెను ఆసుపత్రి సూపరింటెండెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.ఈ మేరకు వారు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల నవతెలంగాణ లో నేను రాను బాబోయ్ సర్కార్ దవాఖాన శీర్షికన కథనం వెలువడిన విషయం పాఠకులకు విదితమే.