నవతెలంగాణ – రామారెడ్డి
సమాజ మెరుగు కోసం, విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్ద వలసిన ఉపాధ్యాయులు పవిత్రమైన వృత్తిలో ఉండి రాజకీయం చేయవద్దని శనివారం తల్లిదండ్రుల సమావేశంలో, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని బాలికోన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ… విద్య బోధన సమయంలో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లను వాడుతున్నారని, సమస్యలను ఎత్తి చూపితే విద్యార్థులపై ప్రభావం చూపుతున్నారని, పిల్లలకు విద్యను అడుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, బాలుర పాఠశాల శిథిలావస్థలో ఉన్నందున, భవనాలను తొలగించాలని సూచించారు. ఉపాధ్యాయులపై వచ్చిన ఆరోపణలను మండల విద్యాశాఖ అధికారి యోసేఫ్ మాట్లాడుతూ.., ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని, ఉపాధ్యాయులు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే, విచారణ జరిపి, భవిష్యత్తు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరయ్య, ఎస్ ఎం సి కమిటీ చైర్మన్ ల్యాగల నాగలక్ష్మి, మాజీ చైర్మన్ ఉష్కే రాజేందర్, బండ కింది రమేష్, దేవదాస్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.