బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

Manala visited the affected familiesనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని కొన సముందర్, బషీరాబాద్ గ్రామాల్లో శనివారం సాయంత్రం పలు బాధిత కుటుంబాలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. కొన సముందర్ లో మాజీ ఎంపీపీ  గుడిసె అంజమ్మ నారాయణ, ఆమె కుటుంబ సభ్యులను మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల అంజమ్మ మామ అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులను మోహన్ రెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సామ ప్రతాప్ రెడ్డిని మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రతాప్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో వైద్యం చేయించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మోహన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. బషీరాబాద్ గ్రామానికి చెందిన వన్నెల దేవేందర్ తల్లిని పరామర్శించారు. అనారోగ్యానికి గురైన దేవేందర్ తల్లి వైద్యం చేయించుకొని ఇటీవల ఆసుపత్రి నుండి వచ్చి ప్రస్తుతం ఇంటి వద్ద కోలుకుంటున్నారు. దేవేందర్ ను  అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  మండల అధ్యక్షులు సుంకేట రవి, కిసాన్ కేత్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేలా ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి  తిప్పిరెడ్డి శ్రీనివాస్, మైనార్టీ సెల్ నాయకులు అబ్దుల్ రఫీ, నాయకులు శేఖర్, మోహన్ నాయక్, గంగాధర్, రాజేశ్వర్, సీనియర్ నాయకులు, తదితరులు  పాల్గొన్నారు.