టిపిటిఎఫ్ కార్యవర్గ సమావేశనీ విజయవంతం చేయాలి 

– జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ 
నవతెలంగాణ –  కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని వర్సెస్ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఉదయం నిర్వహించే టి పి టి ఎఫ్ జిల్లా సమావేశానికి టీపీటీఎఫ్ జిల్లా సభ్యులు హాజరుకావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. (ఆదివారం)ఉదయం 10.30 గంటలకు, నిర్వహించే ఈ  సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ హాజరవుతున్నారనీ కార్యక్రమాన్ని సభ్యులు హాజరై విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి  చేశారు. ఈ సమావేశం  వై.సత్యనారాయణ అధ్యక్షతన, జీవదాన్ హాస్పిటల్ దగ్గర గల వశిష్ట డిగ్రీ కళాశాల కామారెడ్డి లో జరుగుతుంది.జిల్లా కమిటీ సభ్యులు, మండలాల బాధ్యులు, సీనియర్ కార్యకర్తలు తప్పకుండా వీలుచేసుకొని హాజరు కావాలి.ఇటీవల మన ఫెడరేషన్ బాధ్యులు, కార్యకర్తలు తమ వృత్తిలో పదోన్నతులు పొందడం సంతోషం ఇది వారి బాధ్యతను మరింత పెంచుతుందన్నారు. ఈ సందర్బంగా, మన మిత్రులను అభినందించుకోవడం, ఉద్యమ అవసరం. ఈ సమావేశానికి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వై. అశోక్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి మహేందర్ రెడ్డి. ప్రభుత్వ జూనియర్ కళాశాల సంఘ మాజీ అధ్యక్షులు శ్యామ్ రావు.సీనియర్ నాయకులు టి. హన్మాండ్లు,  ఎల్. రామకృష్ణారెడ్డి. డాక్టర్. పి వి ఎస్ ఎన్ రాజు,  ఎన్ని శెట్టి శంకర్, తుర్లపాటి లక్ష్మి. డాక్టర్ వి ఆర్ శర్మ .వై వెంకట్రాంరెడ్డి ఎం కిషన్ రెడ్డి .కె. వేణుగోపాల్, కె. రమణ,పి. అంజయ్య,కె. శ్రీనివాస్ డా. నాగభూషణం లు హాజరౌతున్నారన్నారు.ఈ సమావేశానికి వివిధ కేటగిరీల్లో పదోన్నతులు పొందిన  మిత్రులు, తప్పకుండా, సమయపాలన పాటించి హాజరుకావల్సిందిగా కోరుతున్నాము అన్నారు.