కోల్కత్తా లో పీజీ చదువుతున్న వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా శనివారం దేశవ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రామారెడ్డి పిహెచ్సిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు సురేష్ మాట్లాడుతూ… ఘటనను ఖండిస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.