ముత్తారం మండలానికి చెందిన 67 మంది లబ్ధిదారులకు మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను, 14 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి శనివారం నేరుగా చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధ పడుతూ వైద్యం చేయించుకోగా అయిన వైద్య ఖర్చులకు ప్రభుత్వ పరంగా సహాయం కోసం 67 మంది లబ్ధిదారులకు, అదేవిధంగా నూతనంగా వివాహం చేసుకున్న లబ్ధిదారులు 14 మంది రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా దరఖాస్తు చేసుకోగా, వీరికి చెక్కులు మంజూరు అయ్యాం. ఈ మేరకు లబ్ధిదారులకు ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ేరుగా ఇంటికి వెళ్లి మంత్రి శ్రీధర్ బాబు వ్యక్తిగత సహాయకుడు ఆకుల చంద్రశేఖర్ చెక్కులను అందజేశారు. ప్రభుత్వం ద్వారా చెక్కులు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు కు ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.