
నవతెలంగాణ – కంఠేశ్వర్
డాక్టర్ మౌమీక పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్ ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నాందేవ్వాడలో వెస్ట్ బెంగాల్ ర్.జి కార్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ మౌమిత పై అత్యాచారం చేసిన నిందితుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి మాట్లాడుతూ.. దేశంలో ఒకపక్క స్వాతంత్ర దినోత్సవా వేడుకలు జరుపుకుంటున్న మరో పక్క మహిళల పైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పటిష్టమైన షీ టీం వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశంలో రోజురోజుకు అశ్లీలత చిత్రాలు పెరిగిపోతున్నయని దీన్ని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని వాపోయారు. అదేవిధంగా మహిళా చట్టాలను పకడ్బందీగా అమలుకు ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. డాక్టర్ మౌమిత కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షమాపణ చెప్పాలని ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చట్టాలను తీసుకురావాలని లేకపోతే ప్రభుత్వాలపై పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, జిల్లా ఉపాధ్యక్షులు దీపిక, ప్రసాద్, నాయకులు రాజు,కార్తీక్, ఆల్తమాస్, చేశాను, వినీత్, శ్రావణ్, వరప్రసాద్, అస్లం తదితర నాయకులు పాల్గొన్నారు.