దేశ వ్యాప్తంగా సిద్స్‌ ఫార్మ్‌ నెయ్యి డెలివరీ

హైదరాబాద్‌: దేశంలోని ఐదు ప్రధాన నగరాలలో తమ నెయ్యి కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చినట్లు డి2సి డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ వెల్లడించింది. ”ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరులోని వినియోగదారులు మా నెయ్యి ఉత్పాదనను ఎక్కువగా అభిమానిస్తున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీనిని చేరువ చేస్తున్నాము. మా వెబ్‌సైట్‌పై నూతన షాపింగ్‌ పేజీ ద్వారా దాదాపుగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్డర్‌ చేయవచ్చు. వినియోగదారులకు ఎన్నటికీ నిలిచి ఉండే రుచులను సృష్టించాము.” అని సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ కిశోర్‌ ఇందుకూరి పేర్కొన్నారు.