పట్టణంలోని జర్నలిస్ట్ కాలని అభివృద్ధి కమిటీ ,ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా రాఖీ పండుగ వేడుకలను నిర్వహించినాము జర్నలిస్ట్ కాలనీ రోడ్లపై ద్విచక్ర వాహన దారులు ఎవరైన హెల్మెట్ ధరించ కుండా వస్తె కాలని చిన్నారులు, యువతులు రాఖీ కట్టి హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అని చెపుతు వాహన దారులకు రాఖీలుకట్టడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ కమిటీ అద్యక్షులు శివరాజ్ మద్యం సేవించివాహనాలు నడుపవద్ధని, అది ప్రాణాలకే ప్రమాదమని మీకే కాకుండా మీ పై ఆధార పడిన కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, హెల్మెట్ లేనిప్రయాణం ప్రమాదకరమ తెలిపారు. అభివృద్ధి కమిటీ అద్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ పుర ప్రముకులు 18 సంవత్సరాలు నిండని మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని ఏదైనా ప్రమాదం జరిగితే వాహనాలుఎవరి పేరుతో ఉంటాయో వారినే భాధ్యులుగా చేరుస్తూ చట్టాలు రూపొందించడం జరిగిందనీఅందుకు తల్లిదండ్రులు బాధ్యత వహించావాల్సివస్తుందని అంతే కాకుండా కార్ నడిపే వారు సీ బెల్ట్ పెట్టు కోకుండ, బైక్ నడిపే వారు. హెల్మెట్ ధరించ కుండా వాహనాలునడిపి జరుగ రానిదిఏదైనా అనార్థం జరిగితే … తండ్రి అయితే మీ భార్య పిల్లల పరిస్థితి, తల్లిదండ్రుల కడుపు కోతకు భాధ్యులు మీరే అవుతారని మీ కుటుంబాలు బాగుండాలన్న, మీ పిల్లలు సుఖంగా బ్రతకాలన్న ధరించి ప్రమాదాల నుండి బయటపడి బ్రతకండి. మీ తల్లి తండ్రి కడుపుకోతను నివారించండి మీరే లేకపోతే మీ పిల్లల భవిష్యత్ ఏమిటో ఆలోచించండి అని సుంకే శ్రీనివాస్ వాహన దారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, కొక్కెర భూమన్న, సత్యనారాయణ గౌడ్, గడ్డం శంకర్, కొంతం రాజు, ఎల్ టి కుమార్, ఎర్ర భూమయ్య, రాజ్ కుమార్, గణేష్, జీవన్, పోలీస్ శాఖ నుండి ఎస్ ఐ లు ఆంజమ్మ , గంగాధర్ , ఏ ఎస్ ఐ లక్ష్మణ్ , కానిస్టేబుల్స్ రాఖీ కట్టిన బాలికలు సుంకె తేజశ్రీ, కొక్కెర నిత్యా, వందన, వైష్ణవి, నూత్ పల్లి అక్షయ, నక్షత్ర తది తరులు పాల్గొన్నారు.