
గ్రామీణ బ్యాంకు సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాథోడ్ ప్రహ్లాద్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామీణ బ్యాంకులో రక్షాబంధన్ సందర్భంగా రైతులకు, మహిళలకు, ఖాతాదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా బ్యాంక్ మేనేజర్ రాథోడ్ ప్రహ్లాద్ మాట్లాడుతూ బ్యాంక్ సేవలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని, మధ్యవర్తులు లేకుండా వచ్చి బ్యాంక్ అధికారులను సంప్రదించాలని, రైతులు ప్రతి సంవత్సరం క్రాప్ లోన్స్ రినివాల్ చేసుకుంటే వడ్డీ రాయితీ వస్తుందని, బ్యాంక్ నుండి తీసుకున్న రుణాలు ఆదాయ కార్యక్రమాల కొరకు వాడుకొని సక్రమంగా తిరిగి చెల్లించాలని సూచించారు. మహిళా సంఘాలు పంచసూత్రాలు పాటించాలని, ఒక్కో సంఘం 20 లక్షల వరకు రుణాలు పొందావచ్చని పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ కు, స్థానిక ఎస్ ఐ అప్పారావు కు, బ్యాంకు వచ్చిన రైతులకు రాఖీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గణేష్, గ్రామస్థులు జల్కే పాండూరంగ్, చట్ల ఉత్తం, రైతులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.