పెరిగిన ప్రయాణికుల రద్దీ 

Increased passenger traffic– అదనంగా వివిధ రూట్లోలో 10 బస్సుల ఏర్పాట్లు 

– ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ సిబ్బంది
నవతెలంగాణ –  కామారెడ్డి 
రాఖీ పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ప్రయాణికుల రద్ది విపరీతంగా పెరిగింది, దీంతో బస్టాండ్లో ప్రయాణికులు కిక్కిరిసి పోయారు. దీంతో వివిధ రూట్లో వెళ్లేందుకు ప్రయాణికులు బస్టాండ్లలో వేసి చూస్తూ నిలబడ్డారు. ఈ విషయంపై ఆర్టీసీ మేనేజర్ ఇందిరాను వివరణ కోరగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసామన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులు బాగానే వస్తారని ఊహించామని అందుకు తగ్గట్టుగా ప్రతిరోజు  కామారెడ్డి ఆర్టీసీ డిపో నుండి 126 బస్సులను వివిధ రూట్లో నడిపించే వారమని, ఈ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని   అదనంగా 10 బస్సులను ఏర్పాట్లు చేసి ప్రయాణికులు బస్టాండుకు వచ్చిన అరగంటలోపు వారు వెళ్లే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ఆయా రూట్లలో తాను స్వయంగా ఉంటూ, సిఐ ఇతర సిబ్బందిని ఉంచి ఎలాంటి ఇబ్బందులు కలుగ  కుండా చూస్తున్నామన్నారు.