
మండలంలోని నాగాపూర్, కోనాపూర్ గ్రామాల్లో పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాలను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాఖీ పూర్ణిమను పురస్కరించుకొని సంఘ భవనంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నారు. కోనాపూర్ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా దాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా చిలువేరి సత్య నారాయణ, దైవశెట్టిగా చిలివేరి గణేష్ ఎన్నికయ్యారు. నాగాపూర్ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులుగా అంబల్ల అరవింద్, ఉపాధ్యక్షులుగా చౌట్ పల్లి విట్టల్, కార్యదర్శిగా బొడ్డు రవి చంద్, దైవశెట్టిగా చిలుక దిలీప్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సంఘ కార్యవర్గ సభ్యులకు సహచర సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. రాఖి పూర్ణిమ పురస్కరించుకొని మండలంలోని ఆయా గ్రామాల్లోని పద్మశాలి సంఘ భవనాల్లో పద్మశాలి కుల దైవం మార్కండేయుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సంఘ సభ్యులందరూ జంధ్యాలను స్వీకరించారు.