
– ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-సూర్యాపేట : ప్రతీ ఒక్కరూ తమ పాత జ్ఞాపకాలను నెమరేసుకునేందుకు ప్రతిభింభం ఫోటోగ్రఫీ అని తెలంగాణ రాష్ట్ర ఫోటోఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక లక్ష్మీ దుర్గ ఫోటో స్టూడియో ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫోటోగ్రఫీ మిత్రులందరితో కలిసి మానసిక వికలాంగులతో ఫోటోగ్రఫీ వేడుకలు నిర్వహించుకోవడం చాలా హర్షనీయం అన్నారు. ఫోటోగ్రఫీ మిత్రులు కలిసి ఐక్యంగా యూనియన్ సమస్యలను పరిష్కరించుకొని పలు రకాల సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు లాలు మాట్లాడుతూ అందరూ ఐక్యతతో ఉండాలని పేర్కొన్నారు.పట్టణ అధ్యక్షులు కోకు శేఖర్ మాట్లాడుతూ మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా తన నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం జనగాం క్రాస్ రోడ్ లోని గాంధీనగర్ వద్ద గల స్నేహానిలయంలో మానసిక వికలాంగులు, అనాధలకు వారు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుణగంటి సురేష్, ప్రధాన కార్యదర్శి కూకుంట్ల శంకర్, కోశాధికారి రాపర్తి మహేష్ గౌడ్, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ హరినాధ చారి, కొచ్చర్ల రవి, సాయి రెడ్డి, దుర్గారావు, నజీర్ బాయ్, మాధురి నగేష్, ఆర్ఆర్ ల్యాబ్ శేఖర్, గాయత్రి స్టూడియో లక్ష్మీనారాయణ, బోసు , మిక్సింగ్ పాష, ఓంకార్ రెడ్డి, రాము, వెలుగు శీను, నాగార్జున, యశ్పాల్ రెడ్డి , శ్రీకాంత్,ప్రభు , గణేష్, ఏషాల శ్రీను , మధు, నరేష్, వీరబాబు, సురేష్, శంకర్ రెడ్డి, నసీం, ముజీద్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.