మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా బాడీ పశువులు, పౌల్ట్రీ యూనిట్స్ పై లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరిగింది ఏపీఎం చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారం రెంజల్ ఐకెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో లబ్ధిదా రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఆర్ఎం రామ్ దాస్, ఏడి రోహిత్ రెడ్డి, బోధన్ హాస్పిటల్ డాక్టర్ విశాల్, రెంజల్ వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ విట్టల్, యూనిట్స్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.