ప్లెక్సీకి రాఖీ కట్టి సోదరత్వం చాటుకున్న అభిమాని

నవతెలంగాణ-అశ్వారావుపేట : అభిమానం,ఆప్యాయత,అనురాగం చాటుకోవడానికి నేరుగా ఆయా వ్యక్తుల నే కలవాల్సిన అవసరం లేదు.కబురు చేసి,సందేశం పంపి,ఫోన్ కాల్ తో,ఫేస్బుక్,వాట్సాప్,ఇన్స్ట్రాగ్రాం,ట్విట్టర్ లో ఇలా అనేక మార్గాల్లో దగ్గరి తనం,సోదర త్వం తెలియజేయవచ్చు.
అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కాళింగుల బజారు లో నివాసం ఉంటున్న ముయ్యబోయిన ఉమాదేవి తన ఇంట్లో వున్న ఆంధ్రా మంత్రి,హీరో పవన్ కళ్యాణ్ హోర్డింగ్ కి రాఖి కట్టి తన సోదరత్వాన్ని,అభిమానాన్ని చాటుకున్నారు.ఉమాదేవి గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అశ్వారావుపేట అభ్యర్థి గా పోటీలో వున్నారు.