లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) స్కీం పై ప్రత్యేక అధికారులతో అవగాహన కల్పించడం జరిగిందని ఇన్చార్జ్ ఎంపీడీవో హెచ్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి, రెవెన్యూ అధికారి, ఇరిగేషన్ అధికారితో గ్రామ కార్యదర్శులకు భవన నిర్మాణ అనుమతుల పై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో నూతనంగా భవన నిర్మాణం చేపట్టిన వారికి ఇంటి నెంబర్ కోసం ఈ ముగ్గురు అధికారుల సమక్షంలో ఇంటింటి సర్వే నిర్వహించి అనుమతులు ఇవ్వనున్నట్లు వారు పేర్కొన్నారు. రెంజల్ మండలంలో సుమారు 142 నూతన భవన నిర్మాణం చేసిన లబ్ధిదారులకు అనుమతులను ఇవ్వన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బృందంలో మండల పంచాయతీ అధికారి రఫీ హైమద్, మండల రెవెన్యూ అధికారులు రవికుమార్, నీటిపారుదల శాఖ ఏఈ భూజంధర్, గ్రామ కార్యదర్శిలు రాజేందర్ రావు, నవీన్, సలాం, సతీష్ చంద్ర, బి. రాణి, అశోక్ రావు, భాస్కర్, సాఠాపూర్ కారోబార్ మంగురాం, తదితరులు పాల్గొన్నారు.