– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన రైతులు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఏండ్ల తరబడి ఉన్న వ్యవసాయ బాటను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు.ఇదేమిటని అడిగితే రైతులపై దాడికి పాల్పడ్డారు.న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోకపోవడంతో కలెక్టర్ ను సదరు రైతులు ఆశ్రయించారు.మంగళవారం కలెక్టరేట్ లో బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్ పహాడ్ మండలం అనంతారం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 104, 105, 114, 129, 115, 116, 127, 130 అనుకోని వెళ్తున్న ఏండ్ల తరబడి ఉన్న వ్యవసాయ దారిని ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తుండగా సర్వే నెంబర్ లోని 114, 115లో బీఆర్ఎస్ కు చెందిన ఒంటెద్దు రాఘవ రెడ్డి, చిట్టెపు నారాయణరెడ్డి, కోడిదల రాంబాబు, జనార్దన్ రెడ్డి, రైతులకు దారి లేదని దారిని మూసివేసే ప్రయత్నం చేయగా రైతులందరు కలిసి అడ్డుకున్నారు.అనంతరం టి పాన్ కట్టి సర్వేయర్ తో సర్వే చేసి హద్దు రాళ్లు పాతించగా రెండేళ్ల తర్వాత వచ్చి రైతులు పెట్టిన హద్దురాళ్లను ఎవరు లేని సమయంలో జేసీబీ సహాయంతో బీఆర్ఎస్ నాయకులు దారిని మూసివేశారు.బాట తొలగించిన విషయం అడిగితే తిరిగి తమపైనే దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా ఫెక్ 13బి సృష్టించి పట్టా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.దీనితో రైతులను భూమి పైకి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంతో భూములను పడవు పెట్టాల్సిన దుస్థితి ఏర్పటిందని వాపోయారు.దీనిపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు ఆధారమైన బాట ను గతులు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్న బీఆర్ఎస్ నాయకుల పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.