
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు గడుస్తున్న వాటిని అమలు చేయడంలో విఫలమైతుందన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దోనకంటి నర్సయ్య అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తూ, ఆగస్టు15వ తేదీ లోపల రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి అందరికీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మొత్తం రైతులకు రుణమాఫీ చేయకుండా కొద్దిమంది రైతులకు రుణమాఫీ చేసి చేతులు దులుపుకోవడం సరైంది కాదన్నారు. రానున్న మూడు,నాలుగు రోజుల్లో రైతులకు రుణమాఫీ చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, చౌటుపల్లి రవి మాజీ జెడ్పిటిసి, కౌన్సిలర్లు బోదిరే నరసయ్య,మూత లింబాద్రి, పర్స నవీన్, మాజీ సర్పంచులు సిద్ధపల్లి రాములు, రాగి నరసింహ చారి నాయకులు కర్నె సత్య గంగయ్య,పతాని లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.