నవతెలంగాణ – డిచ్ పల్లి
24 గంటల పాటు ప్రజల దాహార్తిని తీర్చడానికి అహర్నిశలు శ్రమించి పనులు చేస్తున్నా.. గత 6 నేలల నుండి వేతనాలు లేకుండా కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, తమకు వేంటనే వేతనాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ మోటార్లను బంద్ చేసి మిషన్ భగీరథ పంప్ హౌజ్ వద్ద కార్మికులు ఆందోళన, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. ఇందల్ వాయి మండల కేంద్రంలోని మిషన్ భగీరథ పంప్ హౌజ్ లో దాదాపు 40 మంది కార్మికులు అనునిత్యం విధులు నిర్వహిస్తారని అన్నారు. ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటామని, ముందే అరకోరా వేతనాలతో కుటుంబాలను గడుపుకుంటున్నామని తెలిపారు. ఉన్న అరకోర వేతనాలు కూడా సరైన సమయానికి ఇవ్వడం లేదని వాపోయారు. గత 6 నేలలుగా మిషన్ భగీరథలో ఉన్న రెండు ఏజెన్సీ లు కార్మికులకు అందజేసే వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు అవేదన వ్యక్తం చేశారు. ఫిల్టర్ బెడ్ లో పనులు చేసే 23 మంది కార్మికులకు గత ఐదు నెలలుగా ఐహెచ్ పి ఏజెన్సీ నుండి పంప్ హౌస్ లో వీధులను నిర్వర్తించే కార్మికులకు వేతనాలు అందజేయడం లేదని తెలిపారు. ఎవరెస్ట్ ఏజెన్సీ ద్వారా పనులు చేసే కార్మికులకు గత అరు నేలల నుండి వేతనాలు చెల్లించడం లేదని ఇలాగైతే తమ కుటుంబాలు గడిపేదెలా అని వారు ప్రశ్నించారు. ప్రతినెల వేతనం అడుగుతే ఐహెచ్ పి ఏజెన్సీ కి చెందిన ఓక ఇంజనీర్ పనులు చేస్తే చేయండి లేకపోతే వెళ్లిపోవచ్చని భయాందోళనలకు గురి చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. గత కొన్ని ఏళ్లుగా మిషన్ భగీరథ ను నమ్ముకుని కార్మికులుగా పనులను నిబద్ధతతో సమయను సారం చేస్తున్నామని వివరించారు. ఇదే విషయమై మిషన్ భగీరథ డి ఈ అరుణ్ కుమార్ కు వివరణ కోరగా కార్మికులు సమయను సారం పనులు చేస్తున్నారని, కానీ భయాందోళనలకు గురి చేయడం లాంటిదేమీ లేదని, తాము ఎప్పటికప్పుడు ఉన్నతాధి కారులకు నివేదికను అందజేస్తున్నామని, వాస్తవంగా వేతనాలు చెల్లించడం ఆలస్యమవుతుందని డి. ఈ చెప్పుకొచ్చారు.