నవతెలంగాణ – కామారెడ్డి
గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పంచాయతీ అధికారి ( డిపిఓ ) కు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మెమొరాండం అందజేశారు. అనంతరం గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 2000 మందికి పైగా గ్రామపంచాయతీ వర్కర్స్, గ్రామపంచాయతీలలో కార్మికులుగా పనిచేస్తున్నారనీ, వారికి ఇప్పటికే కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడువలేప పరిస్థితుల్లో ఉన్నారనీ, అటువంటి గ్రామపంచాయతీ కార్మికులకు గత ఎనిమిది నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదు పంచాయతీ కార్యదర్శులను అడుగుతే పైకి పంపించిన చెక్కులు అవి రాలేవు అని చెప్తున్నారనీ, కొందరు పంచాయతీ కార్యదర్శిలు తమ సొంత పైసలు ఇస్తున్నారనీ, తప్ప మెజార్టీ గ్రామపంచాయతీలో వేతనాలు రాక కార్మికుల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కావున వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను మంజూరు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. వీరితోపాటు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అందజేశారన్నారు. గ్రామపంచాయతీ నుండి వచ్చే చెక్కులను తోందరగా క్లియర్ చేయాలని, అనేక గ్రామపంచాయతీలో ఇప్పటికీ కార్మికులకు ఇన్సూరెన్స్ చేయలేదన్నారు. వెంటనే ఇన్సూరెన్స్ చేయించాలని గుర్తింపు కార్డులు లేని గ్రామపంచాయతీ కార్మికులకు వెంటనె గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బాలనర్సు, జిల్లా నాయకులు నర్సింలు, సాయిలు, బాలనర్సు, యాదగిరి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.