నవతెలంగాణ – అశ్వారావుపేట
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పటికీ ప్రశాంత జీవనం తో వృద్ధాప్యాన్ని జయించవచ్చని జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ మహేష్ గౌడ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ హోమియో డిస్పెన్సెర్ ఆద్వర్యంలో ఆయుష్ వైద్యాధికారి (మెడికల్ ఆఫీసర్) డాక్టర్ దీపికా నంద్యాల పర్యవేక్షణలో బుధవారం ప్రత్యేక వృద్దులు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మహేష్ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రతీ వారం నిర్వహించే వైద్య శిబిరాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధిక సంఖ్యలో హాజరైన వృద్దులు ను పరీక్షించిన డాక్టర్ దీపిక నంద్యాల కీళ్ళ నొప్పులు,మధుమేహం (సుగర్),అధిక రక్తపోటు తో బాధపడుతున్న వారికి ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ లు జి.జ్యోతి,బి.విజయ్ కుమార్,ఎస్సీ ఎస్ వి.దిద్దుబాబు లు పాల్గొన్నారు.